Pages

Subscribe:

Saturday 19 November 2016

తొలివలపూ..తొందరలూ



చిత్రం :  సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు,  జానకి  
పల్లవి : తొలివలపూ..తొందరలూ
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను.. చలితో నీవు.. చేసే అల్లరులూ...
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు.. చలితో నేను.. చేసే అల్లరులూ...
తొలివలపూ తొందరలు.. ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు .. తొందరలు.. ఉసిగొలిపే .. తెమ్మెరలు
చరణం 1 : పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు.. కరగాలి కౌగిళ్ళలో
వలపించే ఒళ్ళు.. వలచే పరవళ్ళు.. కదిలే పొదరిళ్ళలో
తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు.. కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు.. బిగిసే సంకెళ్ళలో
నీలో అందాలు.. నేనే పొందాలి..నాకే చెందాలిలే..
చరణం 2  : కురిసే ఈ వాన.. తడిసే నాలోనా.. రేపిందిలే తపనా
పలికే పరువాన.. వలపే విరివాన .. నీవే ఆలాపనా
వణికే నీ మేన .. సణిగే నా వీణ .. పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు .. సిగలో నేనుంచనా
నీలో రాగాలు.. నాలో రేగాలి.. నేనే ఊగాలిలే

0 comments:

Post a Comment