Pages

Subscribe:

Saturday 19 November 2016

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా



చిత్రం  :  వయసు పిలిచింది (1978)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  వాణీ జయరాం  
పల్లవి : నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దూ ముచ్చట కాదంటానా..
సరదా పడితే వద్దంటానా.. హయ్య
చరణం 1: నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
దాచినదంతా నీ కొరకే...
దాచినదంతా నీ కొరకే...
నీ కోరిక చూపే.. నను తొందర చేసే
నా వళ్ళంతా ఊపేస్తూ ఉంది...నాలో ఏదో అవుతోంది...
చరణం 2 : నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం..
పరుగులు తీసే నా పరువం...
నీ కథలే విందీ.. నువు కావాలందీ
నా మాటేదీ వినకుండా ఉంది.. నీకూ నాకే జోడందీ

0 comments:

Post a Comment