Pages

Subscribe:

Friday 18 November 2016

తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల

 


చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి: తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....

వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను...
కాకులు దూరని కారడవి...
అందులో.. కాలం యెరుగని మానొకటి..
ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో..

చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు..
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
బావ రావా నన్నేలుకోవా....
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల....
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..

చరణం 1: మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు.. మిన్నంటి మోగెనమ్మా...
వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా.. 

Singapore airlines announces the arrival of flight S2583 



ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా...
సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా..
చరణం 2: గోమాత లేగతో కొండంత ప్రేమతొ దీవించ వచ్చెనమ్మా...
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా... 
Wish you both a happy life... happy happy married life 

నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా..
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం...
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్దిల్ల మనెనమ్మా....

చరణం 3: చేయి చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా..
చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా..
తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా..
అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా...

0 comments:

Post a Comment