Pages

Subscribe:

Sunday 20 November 2016

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు



చిత్రం :  శుభసంకల్పం (1995)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, ఎస్. పి. శైలజ
పల్లవి : సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమై నాచోటా వేద మంత్రాలు
ఏకమై నాచోటా వేద మంత్రాలు
కంచె మేసిన చేను కామాక్షి దైతే
చేనుకులే చింత చెప్పవే దొంగ
కాశి దోచిన దొంగ ఈశుడే అయితే
గంగకేలే బెంగ తెలుపవే సఖియా
చరణం 1 : హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయ్యి శ్రీవారి చేయ్యి
హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంప మేయంగా
చినుకు చినుకు గారాలే చిత్రవర్ణాలు
సొంపులన్ని గుండె గంపకెత్తంగా
సిగ్గులలోనే పుట్టెనమ్మ చిలక తాపాలు

తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
వుక్కలై మెరిసేను ఒనుకు ముత్యాలు
చరణం 2 : తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా
అరె మొవ్వాకు చీర పెడతా మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్లాడుతావ కన్నె చిలకా... అబ్బో ఆశ…
శృంగార పెళ్ళికొడకా… ఇది బంగారు వన్నె చిలకా
శృంగార పెళ్ళికొడకా ఇది బంగారు వన్నె చిలకా
మువ్వకులిస్తే రాదు మోజుపడక
మువ్వకులిస్తే రాదు మోజుపడక
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
హేయ్ రవ్వంటి దాన నిప్పు రవ్వంటి చిన్నదాన... ఏమిచ్చి తీర్చుకోనే దీపకాళికా
రవ్వంటి దాన నిప్పురవ్వంటి చిన్నదాన...  ఏమిచ్చి తీర్చుకోనే దీపకాళికా
రాయంటి చిన్నవాడా… మా రాయుడోరి చిన్నవాడా…
మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా
మనసిచ్చి పుచ్చుకోర మామకొడకా
మనువాడతాను గాని మాను అలకా
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్
తాలే లల్లాల లాలలోయ్ తాలే లల్లాల లాలోయ్

0 comments:

Post a Comment