Pages

Subscribe:

Saturday 19 November 2016

హల్లో నేస్తం బాగున్నావా.. హల్లో నేస్తం గుర్తున్నానా



చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి: హల్లో నేస్తం బాగున్నావా..
హల్లో నేస్తం గుర్తున్నానా..
హల్లో నేస్తం బాగున్నావా..
హల్లో నేస్తం గుర్తున్నానా..
నేనే నువ్వొయ్.. నువ్వే నేనోయ్..
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్..
నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యౌ
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
చరణం 1: ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది..
సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా..
సాయారేమో ఇండియా..
సాయావాడ చైనా..
చరణం 2 : ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం..
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం..
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో..
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో..
సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా..
సాయారేమో ఇండియా..
సాయావాడ చైనా..
చరణం 3 : చైనా ఆట ..మలయా మాట.. హిందూ పాట.. ఒకటేను..
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్...
సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా...
సాయారేమో ఇండియా...
సాయావాడ చైనా...

0 comments:

Post a Comment