Pages

Subscribe:

Saturday 19 November 2016

నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను




చిత్రం: అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు
రచన: సిరివెన్నెల
సంగీతం: చక్రి
గానం: సాందీప్, కౌసల్య

పల్లవి: నాలో నేను లేనే లేను
ఎపుడో నేను నువ్వయ్యాను
అడగక ముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
ప్రేమ ప్రేమ ఇది నీ మహిమా
చరణం: మొన్న నిన్న తెలియదే అసలు
మొన్న నిన్న తెలియదే అసలు
మదిలోన మొదలైన గుసగుసలు
ఏం తోచనీకుంది తీయని దిగులు
రమ్మని పిలిచే కోయిల స్వరమా
కమ్మని కలలే కోరిన వరమా
ఎందాక సాగాలి పయానాలు
చోట ఆగాలి నా పాదాలు
చరణం: ఎన్నో విన్నా జంటల కధలు
ఎన్నో విన్నా జంటల కధలు
నను తాకనే లేదు మధురిమలు
కదిలించనే లేదు కలలు అలలు
గత జన్మలో తీరని రుణమా
నా జంటగా చేరిన ప్రేమా
నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో
నా శ్వాసలో నిన్ను పెంచిందేమో



0 comments:

Post a Comment