Pages

Subscribe:

Tuesday 15 November 2016

స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు



చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల
పల్లవి : స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు
చరణం 1 : కొంగు తగిలిందా పొంగిపోతారు...
కొంగు తగిలిందా పొంగిపోతారు...
కోరి రమ్మంటే బిగిసిపోతారు
ఎందుకో...  ఎందుకో...  ఈ బింకము
అలిగినకొలది అందము... అబ్బాయిగారి కోపము
అలిగినకొలది అందము... అబ్బాయిగారి కోపము
పిలిచిన ప్రేయసికి ఇదేనా కానుక.. మీ కానుక
బెట్టుచాలును దొరగారు..
చరణం 2 : అందమంతా విందు చేస్తే అదిరిపడతారే
అందమంతా విందు చేస్తే అదిరిపడతారే
పొందుకోరి చెంత చేర బెదిరిపోతారే
సరసమొ...  విరసమొ...  ఈ మౌనము
అందిన చిన్నది చులకన.. అందనిదెంతో తీయన
అందిన చిన్నది చులకన.. అందనిదెంతో తీయన
అవతల పెట్టండి... తమాషా పోజులు... మహారాజులు
అధిక చక్కని దొరగారు...

0 comments:

Post a Comment