Pages

Subscribe:

Saturday 19 November 2016

కలిసి ఉంటే కలదు సుఖమూ



చిత్రం :  మరో చరిత్ర (1978)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్యగానం :  బాలు, రమోల
పల్లవి : కలిసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టమూ..శభాష్ !
ఆహ !
కలిసి ఉంటే.. కలిసి ఉంటే కలదు సుఖమూ
కలసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టమూ
ఇది కలిసి వచ్చిన అదృష్టమూ
చరణం 1: కన్నె మనసులూ.. మూగమనసులూ
కన్నె మనసులూ.. మూగమనసులూ
తేనె మనసులూ.. మంచి మనసులూ
చరణం 2: మొనగాళ్ళకు మొనగాడూ.. దసరాబుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ.. పూలరంగడు
మొనగాళ్ళకు మొనగాడూ.. దసరాబుల్లోడు
ప్రేమనగర్.. సోగ్గాడూ.. పూలరంగడు
పక్కింటి అమ్మాయీ..  గడుసమ్మాయీ
ఆ .. ఛీ..ఏం కాదు !
పక్కింటి అమ్మాయీ..  గడుసమ్మాయీ
అమెరికా అమ్మాయి.. రోజులు మారాయీ!!
చరణం 3: మంచివాడు మామకు తగ్గ అల్లుడూ
! అలాగా ?
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడూ
అయ్యో పిచ్చి వాడు !
ఏయ్ .. మంచివాడు మామకు తగ్గ అల్లుడూ
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడూ
ఈడూ జోడు.. తోడూ నీడా.. నాడూ నేడు
అహా !
ఈడూ జోడు.. తోడూ నీడా.. నాడూ నేడు
ప్రేమించి చూడూ.. పెళ్ళి చేసి చూడు
అమ్మ బాబోయ్ !!



0 comments:

Post a Comment