Pages

Subscribe:

Sunday 20 November 2016

రామా కనవేమిరా

  


చిత్రం :  స్వాతిముత్యం (1986)
సంగీతం :  ఇళయరాజా
నేపధ్య గానం :  బాలు, ఎస్. పి. శైలజ 
పల్లవి : రామా కనవేమిరా....
రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ......
రామా కనవేమిరా...
రమణీ లలామ... నవ లావణ్య సీమ
ధరాపుత్రి.. సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి ... నడయాడి రాగా
రామా కనవేమిరా
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా
శ్రీరామ చంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట
తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా...
రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ...
రామా కనవేమిరా...
రమణీ లలామ నవ లావణ్య సీమ
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి.. సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి...  నడయాడి రాగా
రామా కనవేమిరా...
చరణం 1 : ముసిముసి నగవుల రసిక శిఖామణులు
సా ని ద మ ప మ గ రి స
ఒసపరి చూపుల అసవిష   విక్రములు
స గ రి గ మ ని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు.. తా తకిట తక జణుత
ఒసపరి చూపుల అసవిష  విక్రములు
తకజణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మా గ రి గ మ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ...  ఆహ
క్షణమే.. ఒక దినమై.. నిరీక్షణమే... ఒక యుగమై
తరుణి వంక శివ..  ధనువు వంక.. తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
చరణం 2 : ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు.. భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు.. భూ వరులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులు
తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి... ఒగ్గేసిన పురుషాగ్రణులు
ఎత్తే వారు లేరా.. అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా...
ఎత్తే వారు లేరా.. అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా..
అరెరె ఎత్తే వారు లేరా.. అ... విల్లు ఎక్కు పెట్టే వారు లేరా..
అహ ఎత్తే వారు లేరా ... అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తకద తైయ్యకు తా ధిమి తా..
చరణం 2 : రామాయ.. రామభద్రాయ.. రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు.. ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీతవంక ఓరకంట చూసినాడు... సీతవంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళవిరిగెను శివధనువు కళలొలికెను సీతానవవధువు
జయజయరామ రఘుకులసోమా
జయజయరామ రఘుకులసోమా
దశరధరామా దైత్యవిరామా
దశరధరామా దైత్యవిరామా
జయజయరామ రఘుకులసోమా
దశరధరామా దైత్యవిరామ
సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే
సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయమే... అనగ అనగ రమణీయమే
కనగ కనగ కమనీయమే... అనగ అనగ రమణీయమే
సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే
రామయ్య.. అదుగోనయ్య..
రమణీ లలామ... నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి.. నడయాడి రాగా
రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా...
రామా కనవేమిరా...

0 comments:

Post a Comment