Pages

Subscribe:

Saturday 19 November 2016

పదహారేళ్ళకు.. నీలో... నాలో



చిత్రం :  మరో చరిత్ర (1978)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  జానకి
పల్లవి : పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వన్నెలల్లే విరియ బూసి... వెల్లువల్లే ఉరకలేసే
పదహారేళ్ళకు.. నీలో... నాలో
ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
చరణం 1: పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు..
పాటలు పాడిన చిరు గాలులకు...
తెరచాటొసగిన.. చెలులు శిలలకు
తెరచాటొసగిన.. చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకూ...
కోటి దండాలు.. శతకోటి దండాలూ
చరణం 2: నాతో కలిసి నడచిన... కాళ్ళకు
నాలో నిన్నే నింపిన... కళ్ళకు
నిన్నే పిలిచే... నా పెదవులకు
నీకై చిక్కిన... నా నడుమునకూ...
కోటి దండాలు... శతకోటి దండాలూ
చరణం 3: భ్రమలో లేపిన... తొలి జాములకు
సమయం కుదిరిన... సందె వేళలకు
నిన్నూ నన్ను... కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను... కన్న వాళ్ళకూ
మనకై వేచే... ముందు నాళ్ళకూ
కోటి దండాలు... శతకోటి దండాలు.. ఊ..
కోటి దండాలు.. శతకోటి దండాలూ

0 comments:

Post a Comment