Pages

Subscribe:

Tuesday 15 November 2016

మధురం మధురం ఈ సమయం



చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల
పల్లవి: మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం
చరణం 1: చల్లని పున్నమి వెన్నెలలో.. ఓ ఓ ఓ ఓ ఓ ...
ఎన్నడు వీడని కౌగిలిలో.. ఆ ఆ ఆ ఆ ....
చల్లని పున్నమి వెన్నెలలో.. ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతులు మెరయగ!!
చరణం 2: కరగిపోయె పెను చీకటి పొరలూ...
కరగిపోయె పెను చీకటి పొరలూ
తొలగిపోయె అనుమానపు తెరలు.. తొలగిపోయె అనుమానపు తెరలు
పరిమళించె అనురాగపు విరులు.. పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందనవనముగ!!
చరణం 3: సఫలమాయె మన తీయని కలలూ..ఊ ఊ ...
సఫలమాయే మన తీయని కలలు
జగము నిండె నవజీవన కళలు.. జగము నిండె నవజీవన కళలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు.. పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగా


0 comments:

Post a Comment