Pages

Subscribe:

Sunday 20 November 2016

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు



చిత్రం: ఇంద్రుడు-చంద్రుడు (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి
పల్లవి: ఒచ్చంటావో గిచ్చింటివో తీసెయ్ నీయమ్మా
నచ్చిన సినిమా చూసేయంగా వోసి నాయమ్మా
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కనపెట్టి.. పట్టరా ఓ పట్టు
వెయ్యరా సయ్యంటూ నడుంచుట్టూ ఉడుంపట్టు
చిందేయరా రయ్యంటూ పదం వింటూ పదా అంటూ
నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు
తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు
చరణం 1: వినరో పిటపిటలాడే పిట్టల కొక్కొరొకో
పదరో చిటపటలాడే ఈడుకు చిక్కిదిగో
కసితో కుతకుత ఉడికే కళ్ళకు విందిదిగో
ఎదలో కితకితపెట్టే మల్లెల చిందిదిగో
చెక్కిలినొక్కుల చిక్కులలో.. చిక్కని మక్కువ చిక్కునురో
చక్కిలిగింతల తొక్కిడిలో.. ఉక్కిరిబిక్కిరి తప్పదురో
అక్కర తీర్చే అంగడిలో..
అద్దాల అందాలు అందాలి పదరా
చరణం 2: సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో
జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో
త్వరగా కలబడి ఖానా పీనా కానీరో
మరిగే కలతకు జాణలదాణా కానుకరో
తుళ్ళెను అందం కళ్ళెదురా ఒల్లని పందెం చెల్లదురా
మల్లెల గంధం చల్లునురా అల్లరి బంధం అల్లునురా
అత్తరుసోకే కత్తెరలా మొత్తంగా మెత్తంగా కోస్తుంది కదరా


0 comments:

Post a Comment