Pages

Subscribe:

Sunday 20 November 2016

ఓ.. ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా



చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి : ఓ.. ప్రియా ప్రియా నా.. ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం...  నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ
ఓ.. ప్రియా ప్రియా...  నా  ప్రియా ప్రియా
ఓ.. ప్రియా ప్రియా...  నా  ప్రియా ప్రియా
ఏల జాలి మాటలు...  మాసిపోవు ఆశలు
నింగీనేల తాకేవేళ
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే...  రేపు లేదులే
వీడుకోలిదే...  వీడుకోలిదే
చరణం 1 : నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు గెలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు
రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమ
ఓ.. ప్రియా ప్రియా నా.. ప్రియా ప్రియా
ఓ.. ప్రియా ప్రియా నా.. ప్రియా ప్రియా
చరణం 2 : కాళిదాసు గీతికీ కృష్ణరాస లీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవి
ఆ అనారు  ఆశకి.. తాజమహలు శోభకి
పేదవాడి ప్రేమకి.. చావు పల్లకి
నిధి కన్నా ఎదమిన్న గెలిపించు ప్రేమలే
కథకాదు బ్రతుకంటే బలికాని ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమ
ఓ.. ప్రియా ప్రియా... నా  ప్రియా ప్రియా
ఓ.. ప్రియా ప్రియా...  నా  ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమంది లేకసి
నింగీనేల తాకేవేళ
నీవే నేనై పోయే క్షణాల
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం....  ప్రేమదే జయం


0 comments:

Post a Comment