Pages

Subscribe:

Sunday 20 November 2016

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో



చిత్రం: ఇంద్రుడు-చంద్రుడు (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డో రే మీ రాగాల జోరేమీ
దా సా దా నా ప్రేమ నీమీద శృతికలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
చరణం 1: చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే
కనుల కనుల నడుమలో కలలుసుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే
తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలూ కంటితోనే తాగుమా
హంసలా హాయిగా ఆమనీ రేయిలా వాలిపో ప్రియా
ఓ ఓ ఓ.....
చరణం 2: ఎదుట పడిన బిడియమే చెమట నుదుట చిలికెలే
వణుకు తొణుకు పరువమే వడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కధలలో చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదై పోకుమా
గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా
పాటలా తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా
ఓ ఓ ఓ...

0 comments:

Post a Comment