Pages

Subscribe:

Tuesday 15 November 2016

జోరుగా హుషారుగా... షికారు పోదమా



చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల
పల్లవి : జోరుగా హుషారుగా...  షికారు పోదమా
హాయి హాయిగా...  తీయ తీయ్యగా
జోరుగా హుషారుగా...  షికారు పోదమా
హాయి హాయిగా...  తీయ తీయ్యగా
జోరుగా.....
చరణం 1 : ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే మరువనంటినే

జోరుగా హుషారుగా...  షికారు పోదమా
జోరుగా.....
చరణం 2 : నీ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
ఓ.... ఓఓ... ఓ...ఓ
వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలిసిరాగదే కలిసిరాగదే
ఓ... జోరుగా.....
జోరుగా హుషారుగా...  షికారు పోదమా
చరణం 3 : నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే
ఓ.... ఓఓ... ఓ...ఓ
నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే
కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే
వరించినాడనే వరించినాడనే ఓ.... ఓఓ... ఓ...ఓ

0 comments:

Post a Comment