Pages

Subscribe:

Sunday 20 November 2016

మధుర మురళి హృదయ రవళి

  


చిత్రం :  ఒక రాధ-ఇద్దరు కృష్ణులు (1986)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి 
పల్లవి : మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి... పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా..  నా అందాలు నీవే రా కన్నా
ధుర మురళి హృదయ రవళి
యదలు కలుపు ప్రణయ కడలి...  సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా...  ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా...  ఎవరున్నారు రాధమ్మ కన్నా
చరణం 1 : గోధూళి వేళల్లో.. గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో 
పున్నాగ తోటల్లో..  సన్నాయి పందిట్లో
నాజూకులన్నీ నాకు దక్కేవేళల్లో 
పగలో అవతారం.. రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ 
రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతము...  ఇక నీదే ఈ సరసాల సంగీతం 
చరణం 2 : హేమంత వేళల్లో...  లే మంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే 
కార్తీక వెన్నెల్లో... ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే 
ముద్దే మందారం ... మనసే మకరందం
సిగ్గే సింధూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే 
పాటే అనురాగము మన బాటే
ఓ అందాల అనుబంధం



0 comments:

Post a Comment