Pages

Subscribe:

Saturday 19 November 2016

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు



చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి: కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
చరణం 1: గతమున పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్లు
వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెపుడూ జతగాళ్ళు
చెడుపుకెపుడు పగవాళ్ళు వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్లు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
చరణం 2: తళతళ మెరిసేటి కళ్ళు నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముల్లు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ.. 
చరణం 3: నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్లు
దులిపెయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసెయ్ పాతసంకెళ్ళు మనషులె మన నేస్తాలు
Come on clap..
మనసులె మన కోవెళ్ళు ఎవెర్య్బొద్య్
మనషులె మన నేస్తాలు మనసులె మన కోవెళ్ళు
మనకు మనమె దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

0 comments:

Post a Comment