Pages

Subscribe:

Sunday 23 March 2014

తెల్లవారనీకు ఈరేయిని

   
ప: తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయని హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయని హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని


౧. నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని
ఆ కైపులో లోకాలే మరువన
నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని
ఆ కైపులో లోకాలే మరువని
మనసులో మనసునై మసలనీ
మనసులో మనసునై మసలనీ
నీ మనిషినై మమతనై మురిసిపోనీ!!

౨.  నీ కురులే చీకటులై కప్పివేయనీ
ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోనీ
నీ కురులే చీకటులై కప్పివేయనీ
ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోనీ
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ
తడియారని హృదిలో నను మొలకలెత్తనీ!!

౩.  మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ
అల్లరీ పడుచుదనం కొల్లబోనీ
మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ
అల్లరీ పడుచుదనం కొల్లబోనీ
కొల్లగొన్న మనసే నా ఇల్లనీ
కొల్లగొన్న మనసే నా ఇల్లనీ
చల్లగా కాపురమూ ఉండిపోనీ!!

0 comments:

Post a Comment