Pages

Subscribe:

Thursday 13 March 2014

మల్లెపూవులు విరిసెరా మంచుతెరలు కరిగెరా

          
చిత్రం: ఇల్లాలు
రచన: ఆత్రేయ
సంగీతం: కె వి మహదేవన్
గానం: పి సుశీల


ప: మల్లె పూవులు విరిసెరా -
మంచు తెరలు కరిగెరా
-నల్లనయ్యా మేలుకో -
చల్లనయ్యా మేలుకో!!


౧.  పురిటి వెలుగున బుగ్గపై - - నీ పంటి నొక్కులు కంటిరా - -
చిరుత నవ్వుల పెదవిపై - -చిరుత నవ్వుల పెదవిపై - -
నా కంటి కాటుక నంటె రా!!నల్లనయ్యా!!


౨.  చిక్కు పడినా కురులు చూసి - - సిగ్గు ముంచుకు వచ్చెరా ! - -
రేయి గడపిన హాయినంతా - -రేయి గడపిన హాయినంతా - -
మనసు నెమరు వేసెరా !!నల్లనయ్యా!!


౩.  నీవు నిండుగ నవ్వినపుడే - -నాకు నిజముగ తెల్లవారును - -
నా కాపురానా రేపు మాపులు - -కాపురానా రేపు మాపులు -
-కలవురా నీ చూపులోనే!!నల్లనయ్యా!!

0 comments:

Post a Comment