Pages

Subscribe:

Wednesday 26 March 2014

చిటపట చినుకులు పడుతూ ఉంటే


ప: చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులుపట్టి
చెట్టునీడకై పరుగిడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ


ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే
మెరుపులు తళతళ్ మెరుస్తు ఉంటే
మెరుపులు వెలుగులో చెలి కన్నులలో
బిత్తరచూపులు కనపడుఉంటే
చెప్పలేనిఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి


౧. కారుమబ్బులు కమ్ముతు ఉంటే
కళ్ళకు ఎవరూ కనపడకుంటే.... కనపడకుంటే!!2!!
 జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ!!


౨. చలి చలిగా గిలివేస్తుంటే ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే ఓహోహో!!2!!
చెలి గుండియలో రగిలే వగలే
చెలి గుండియలో రగిలే వగలే
చలిమంటలుగా అనుకుంటే
చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ!!



0 comments:

Post a Comment