Pages

Subscribe:

Sunday 23 March 2014

ఎక్కడికి పోతావు చిన్నవాడా

  
ప: ఎక్కడికి పోతావు చిన్నవాడా
ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా

౧.  కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు
మారినా మనిషిగా బతకలేవు!!

౨.  నన్నిడిచి నువ్వేళితే నీ వెంట నేనుంటా
నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా
ప్రేమంటే అంతేరా పిచ్చివాడా!!
ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా
ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా

౩.  పాడమ్మా పాడు
పాడమంటే పాడేది పాటకాదు ఆడమంటే ఆడేది ఆటకాదు
పాడమంటే పాడేది పాటకాదు ఆడమంటే ఆడేది ఆటకాదు
ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు
పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు

ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా నీ చూపులను ఓపలేను పిల్లవాడా
ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా
ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా

0 comments:

Post a Comment