Pages

Subscribe:

Tuesday 25 March 2014

అబ్బ దీని సోకు సంపంగి రేకు

    
ప: అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటే షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తుపు
అమ్మ రాకు రాకు నేనున్నా వైపు
ఏ గులాబీ మొగ్గ లాటి ఎర్రబుగ్గనంటుకున్న
ముద్దులన్ని మోత పుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న
పూలు మోజులన్ని మాలలల్లె

౧.  దోర అందాలు చూసాక నేను దోచుకోకుంటే ఆగేదేలా
కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదేలా
సందె పొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా
చిమ్మ చీకట్లే సిగ్గు పడ్డాక నిన్ను నేనల్లుకోనా
ఒడ్డు లేని ఏరు ఒడేలే భామా
అడ్డు లేని ప్రేమ ఇదేనులే
ముద్దు పెట్టగానే ముళ్ళు జారిపోయే
వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి
చాటు చూసి దాటుతుంటే తంట!!


౨. ఎన్ని బాణాలు వేసావు నీవు తీపి గాయాలతో చెప్పనా
ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో కంటికే నోరు మూసేయ్యనా
ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంత కౌగిలే కప్పుకోనా
మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా
తెడ్డు లేని నావ చలాకి ప్రేమ
సందు చూసి ఆడే సరాగమే
బొట్టు పెట్టగానే కట్టు జారిపోయే
వెన్నెలంటి శోకులన్ని ఈనెదీసి ఇవ్వబోతే ముందుగానే దోపిడైతే టాటా!!

0 comments:

Post a Comment