Pages

Subscribe:

Sunday 16 March 2014

ఆరోజు నారాణి చిరునవ్వు చూసి

   

చిత్రం: బృందావనం
సంగీతం: మాధవపెద్ది సురేష్
రచన: వెన్నెలకంటి
గానం: ఎస్ పి బాలు, ఎస్ జానకి

ప: ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నారాణి చిరునవ్వు చూసి అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే తెలిసింది ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని

౧. ఆ రోజు జాబిల్లీ పగలే వచ్చింది
ఈరోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆ రోజు ఓ చూపూ వలలే వేసింది
ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
కన్నులే వెన్నలాయే వన్నెలే వెన్నెలాయే
ముద్దలా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే
ఈ రోజే నాకు తెలిసింది ఈ చిత్రాలే చేసింది లవ్వని
మధుపత్రాలు రాసింది లవ్వనీ!!


౨. ఆ రోజు కలలోన తొణికే ఆ ప్రేమ
ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
ఆరోజు మెరిసింది అందం చిరునామా
ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
గుండెలో అల్లరాయే ఎండలే చల్లనాయే
ఆశలే వెల్లువాయే ఊసులే చల్లిపోయే
ఈ రోజే నాకు తెలిసింది రాగాలు రేపింది లవ్వనీ
అనురాగాలు చూపింది నువ్వని!!

0 comments:

Post a Comment