Pages

Subscribe:

Sunday 16 March 2014

మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం

     
చిత్రం: బృందావనం
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : వెన్నెలకంటి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

ప: మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం

౧.  చరణాలు ఎన్నివున్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్నివున్నా వెలుగొక్కటే కదా
శతకోటి భావాలను పలుకు ఎదమారునా
సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా!!


౨.  వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎనలేని రాగాలకు నాదమొకటే కదా
అనుభూతులెన్నివున్నా హృదయమొకటే కదా!!

0 comments:

Post a Comment