Pages

Subscribe:

Tuesday 25 March 2014

తొలిచూపు ఒక పరిచయం మలిచూపు ఒక అనుభవం

                           


ప: తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

౧. ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
వెలిసింది దేవాలయం..అదే ప్రేమాలయం
ఒక రాగం పిలిచిన చోట..అనురాగం పలికిన చోటా
వెలిసింది రాగాలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం!!

౨. మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట
వెలిసింది హృదయాలయం..అదే ప్రేమాలయం
ఆకాశం వంగిన చోట..భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం!!



0 comments:

Post a Comment