Pages

Subscribe:

Friday 21 March 2014

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా

         
ప: చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలొ నీవయ్య...
నిన్ను చూసి మురిసేను.. నేను మేను మరిచేను...
ఎత్తుకొని ముద్దాడీ.. ఉయ్యాలలూపేను...
జోలపాట పాడేనూ.. లాలి పాట పాడేను...
చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలొ నీవయ్య...
నిన్ను చూసి మురిసేను.. నేను మేను మరిచేను...

౧. నీ ఒడిలొ నిదురించి.. తీయనీ కల గాంచి...
పొంగి పొంగి పొయాను.. పుణ్యమెంతో చేసాను...
నీ ఒడిలొ నిదురించీ.. తీయనీ కల గాంచీ...
పొంగి పొంగి పొయాను.. పుణ్యమెంతో చేసాను...
ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా...
ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా...
అమ్మ వలె రమ్మనగ.. పాప వలె చేరేవు...
నా చెంత నీవుంటే.. స్వర్గమే నాదౌను...
గాయత్రి మంత్రమును జపించే భక్తుడనే...
కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే...


౨. స్నానమాడె శుభవేళ.. కురులలో పువ్వులతో...
దేవి వలె..నీవొస్తే.. నా మనసు నిలువదులే...
స్నానమాడె శుభవేళ.. కురులలో పువ్వులతో...
దేవి వలె..నీవొస్తే.. నా మనసు నిలువదులే...
అందాల కన్నులకు కాటుకను దిద్దేను...
చెడు చూపు పడకుండా అగరు చుక్క పెట్టేను...

0 comments:

Post a Comment