Pages

Subscribe:

Wednesday 5 March 2014

నీలమోహనా రారా

     
చిత్రం: డాక్టర్ ఆనంద్
సంగీతం: కె వి మహదేవన్
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: సుశీల



ప: నీల మోహనా ! రారా !
నిన్ను పిలిచె నెమలి నెరజాణ
జారువలపు జడివాన కురిసెరా !
జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా ! ||| నీల మోహనా |||


౧. ఏలాగె మతిమాలి ?
ఏడే నీ వనమాలి ?
అతడేనేమో అనుకున్నానే
అంతదవుల శ్రావణ మేఘములగనీ || అతడేనేమో ||
ప్రతిమబ్బూ ప్రభువైతే,
ప్రతికొమ్మా మురళైతే,
ఏలాగే ?


౨. సారెకు దాగెద వేమీ ?
నీ రూపము దాచిదాచి
ఊరించుటకా స్వామీ ?
నీ కన్నులతోడు నీ కలికి నవ్వులతోడు
నీ కోసం ఎంత వేగిపోయానో కృష్ణా...


౩. అటు... అటు... ఇటు... ఇటు...
ఆ పొగడ కొమ్మవైపు !
ఈ మొగలి గుబురువైపు !
కార్తీక రాతిరిలో కరిమబ్బుంటుందా ?
నీలమేఘ మాకాశము విడిచి నేల నడుస్తుందా ?
నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా ?
నవ్వే పెదవులకు మువ్వల మురళుందా ?
పెదవి నందితే పేద వెదుళ్లు - కదలి పాడతాయా ?
నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు !

0 comments:

Post a Comment