Pages

Subscribe:

Thursday 13 March 2014

మనసు పాడింది సన్నాయి పాట

   
 చిత్రం : పుణ్యవతి
 సంగీతం : ఘంటసాల
రచన :  సి. నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, పి. సుశీల

ప: మనసు పాడింది సన్నాయి పాట
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ ఆ ....
మనసు పాడింది సన్నాయి పాట

౧. జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
తొలిసిగ్గు చిగురించగా... నా అలివేణి  తలవాల్చిరాగా!!

౨. చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా..ఆ..
వలపులు పెనవేసుకోగా ... నా వనరాజు ననుచేర రాగా!!

౩. మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ... ఆ..
పెదవులకందనీ మధురిమలేవో .. హృదయాలు చవిచూడగా!!

0 comments:

Post a Comment