Pages

Subscribe:

Tuesday 25 March 2014

అమ్మను మించి దైవమున్నదా

   
ప: అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అర్ధమున్నదా(2)
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

౧. రఘురాముడి లాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాసి సీతలాగా తాను
కోటి ఉగాదులే నా గడపకు తేవాలి
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే(2)
ఈ లోగిలి కోవెలగా మారాలి...(అమ్మను)

౨. తప్పటడుగులేసిన చిన నాడు
అయ్యో తండ్రీ అని గుండెకద్దుకున్నావు
తప్పుటడుగులేస్తే ఈ నాడు
నన్ను నిప్పుల్లో నడిపించు ఏ నాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే(2)
అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే



0 comments:

Post a Comment