Pages

Subscribe:

Thursday 13 March 2014

నవ్వుల నదిలో పూవుల పడవ

                 
చిత్రం : మర్మయోగి
 రచన : ఆరుద్ర
సంగీతం : ఘంటసాల
గానం : పి.లీల, ఘంటసాల


ప: నవ్వుల నదిలో పూవుల పడవ కదిలే...
ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి...
నవ్వుల నదిలో పవ్వుల పడవ కదిలే...
ఇది మైమరపించే హాయి... ఇక రానేరాదీరేయి!!

౧.  అనుకోని సుఖము పిలిచేను
అనురాగ మధువు ఒలికేను
అనుకోని సుఖము పిలిచేను
అనురాగ మధువు ఒలికేను
కొనగోటితో నిను తాకితే పులకించవలెను నీ మేను!!

౨.  నిదురించవోయి ఒడిలోన
నిను వలచెనోయి నెరజాణ
నిదురించవోయి ఒడిలోన
నిను వలచెనోయి నెరజాణ
అరచేతిలో వైకుంఠము దొరికేను నీకు నిముషాన!!

0 comments:

Post a Comment