Pages

Subscribe:

Tuesday 25 March 2014

కోకిలమ్మ పెళ్ళికీ కోనంతా పందిరి

    
ప: కుకు కుకు కుకు కుకు
కోకిలమ్మ పెళ్ళికీ కోనంతా పందిరి
చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి


డుడుం డుడుం డుడుం డుడుం
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి
పూలన్నీ తలంబ్రాలు పున్నమీ తొలిరేయి


1. తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన
పిల్లదానికొచ్చిందీ కళ..పెళ్ళి కళా
తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన
పెళ్ళికొడుకు నవ్వితే తళా...తళతళా
పూలగాలితో రేగిన పుప్పొడి పారాణిగా
చిలకపాట నెమలి ఆట కలిసి మేజువాణిగా(2)
అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే
అడవిలోని వాగులన్ని ఆనందపు కెరటాలై!!కుకు!!


౨. కన్ను కన్ను కలుపుకున్న కన్నెమనసు
తెలుసుకున్న కనుల నీలినీడలో కదా ప్రేమకథ
బుగ్గలలో నిగ్గుదీసి సిగ్గులలో చిలకరించు
మొగ్గవలపు విచ్చితే కదా...పెళ్ళి కథ
ఇరుమనసుల కొకతనువై ఇరుతనువులకొక మనువై
మనసులోని వలపులన్ని మల్లెల విరిపానుపులై(2)
కలిసివున్న నూరేళ్ళు కలలుగన్న వేయేళ్ళు
మూడుముళ్ళు పడిననాడు ఎదలు పూలపొరరిళ్ళు!!కుకు!!

0 comments:

Post a Comment