Pages

Subscribe:

Saturday 29 March 2014

పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

     
ప: పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చతెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబొమ్మ అందం

౧. రతనాల కోట ఉంది రాచకన్నె లేదు
రంగైన తోట ఉంది రామచిలుక లేదు
ఆ రాచకన్నెవు నీవై అలరిస్తే అందం
నా రామచిలుకవు నీవై నవ్వితేనె అందం!!

౨. కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ
తోడులేని మరునాడూ వాడిపోవు కాదా
ఆతీగకు పందిరి నీవై అందుకుంటె అందం
ఆకన్నెకు తోడుగ నిలిచి అల్లుకుంటె అందం!!

౩. నీ సోగకన్నుల పైన బాస చేసినాను
నిండు మనసు కోవెలలోనా నిన్ను దాచినాను
ఇరువుతిని ఏకం చేసే ఈ రాగబంధం
ఎన్నెన్ని జన్మలకైనా చెరిగిపోని అందం
చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం
అనురాగ గీతిలోనా అచ్చతెలుగు అందంలాలలాల!!








0 comments:

Post a Comment