Pages

Subscribe:

Saturday 22 March 2014

ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందమామ

                 
ఆమబ్బు తెరలలోనా దాగుంది చందమామ
ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ
ఏమంది సత్యభామ
ఏమందో ఏమో కానీ పరిహాసాలే చాలునంది
 శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది
దూరాన ఆగమంది


౧. ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా
ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా
ఊరించే సైగలతోనే ఏమంది తియ్యగా
పరువాల తొందరా నెలరాజు ముందరా
పరువాల తొందరా నెలరాజు ముందరా
మర్యాా కాదన కాదా పలికింది చల్లగా
పలికింది మెల్లగా!!

౨.  సిగలోని పువ్వులు చిలికించే నవ్వులు
సిగలోని పువ్వులు చిలికించే నవ్వులు
ఓ ఓ ఓ ఓ ఓ
మనకోసం ఏ సందేశం అందించే ప్రేయసీ
ఆనందసీమలా అనురాగ డోలలా
ఆనందసీమలా అనురాగ డోలలా
కలకాలం తేలీసోలీ ఆడాలి హాయిగా
అన్నాయి తియ్యగా
ఆ మబ్బు తెరలే తొలగి ఆగింది చందమామ
ప్రేమికుల హృదయము తెలిసి పాడింది చందమామ
పాడింది చందమామ

0 comments:

Post a Comment