Pages

Subscribe:

Thursday 6 March 2014

అందాల రాణివే నీవెంత జాణవే

               
చిత్రం: బందిపోటు
సంగీతం: ఎస్ రాజేశ్వర రావు
రచన: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, పి సుశీల

ప: అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా ఆ
వీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత యేల ఇంత తొందరా ఆ ఆ వీరాధి వీరులే

౧. పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
సుఖాల తీరము ఇంకెంత దూరము ఓ ఓ ఓ
పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
సుఖాల తీరము ఇకెంత దూరము
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నీరిక్ష చాల మంచిదీ
 వీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత యేల ఇంత తొందరా ఆ ఆ వీరాధి వీరులే

౨. క్రీగంటితో నను దోచి నా గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడుతే చాలులే ఆడుతే చాలులే
చాలులే చాలులే
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము అహహా ఆ ఆ
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించె మోహము
నేనింక తాళజాలనే ఏ ఏ  ఏ !!అందాల రాణివే!!
 
౩. నీ వంటివారికి మేలా మేలెంచు పెద్దలు లేరా
వారిదే భారము యేల ఈ ఆగము
ఆగుము ఆగుము ఆగను ఆగను
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనినను నీ చేయి విడువను ఓ ఓ ఓ ఓ
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనినను నీ చేయి విడువను
జగానికందము వివాహబంధము ఆనాడే తీరు వేడుకా ఆ !!అందాల రాణివే!!
 

0 comments:

Post a Comment