Pages

Subscribe:

Wednesday 26 March 2014

వస్తాడు నారాజు ఈరోజు

                 


వస్తాడు నారాజు ఈరోజు
తానె వస్తాడు నెలరాజు ఈరోజు
కార్తీక పున్నమి వేళలో
కలికి వెన్నెల జలతారుపైనా
తేలి వస్తాడు నారాజు ఈరోజు

౧.  వేలతారకల నయనాలతో నీలాకాశం తిలకించేను!!2!!
అతని చల్లని అడుగుల సవ్వడి వీచేగాలి వినిపించేను
ఆతని పావన పాదధూళికై అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను!!

౨. వెన్నెలలెంతగ విరిసిన  గానీ చంద్రుణ్ణీ విడిపోలేవు
కెరటాలెంతగా పొంగినగానీ కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైనా దారులు వేరైనా
తనువులు వేరైనా దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే!! 

0 comments:

Post a Comment