Pages

Subscribe:

Sunday 16 March 2014

ఏడుకొండలసామీ ఎక్కడున్నావయ్యా

               
 రచన : రావులపర్తి భద్రిరాజు
సంగీతం, గానం : ఘంటసాల

ప: ఏడుకొండలవాడా
వెంకటరమణా గోవిందా గోవింద
ఏడుకొండలసామీ
ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా
కానారావేమయ్యా ఆ...
ఏడుకొండలసామీ... (2)

౧.  ఆకాశమంటూ ఈ కొండశిఖరమ్ముపై
ఆకాశమంటూ ఈ కొండశిఖరమ్ముపై
మనుషులకు దూరంగా
మసలుతున్నావా (2)
ఏడుకొండలసామీ... (2)

౨.  ఏచోట గాంచినా నీవుందువందురే
ఏమిటో నీ మాయ
తెలియకున్నామయ్యా॥
ఈ అడవి దారిలో చేయూతనీయవా
ఈ అడవి దారిలో చేయూతనీయవా
నీ పాద సన్నిధికి మముజేరనీయవా
నీ పాద సన్నిధికి మముజేరనీయవ!!

0 comments:

Post a Comment