Pages

Subscribe:

Tuesday 25 March 2014

బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి

ప: బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి           
నీ బోసినవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి 
బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి 

1. పాలుగారు ప్రాయములో నీలాగే ఉన్నాను     
బంగారు ఉయాలలో పవళించి ఊగాను  
ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై 
మనసే మురిసెనురా మమతే పెరిగెనురా 
నీ బోసినవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి 
            
౨. ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా 
ఇరుహృదయాలొకటైతే పాడేది లాలిరా            
యేతల్లి కన్నదో యేబంధం ఉన్నదో 
మనసే మురిసెనురా మమతే పెరిగెనురా 
నీ బోసినవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి!!
            
౩. పువ్వంటి మనసులో ముళ్ళున్న జగతిరా  
 
మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా            
నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు 
పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా 
నీ బోసినవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి 
బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి 

0 comments:

Post a Comment