Pages

Subscribe:

Wednesday 26 March 2014

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

  
తెలుగు వీర లేవరా… దీక్ష బూని సాగరా - 2
దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా…
నీతి లేని శాసనాలు నేటినుండి రద్దురా…

నిదుర వద్దు బెదర వద్దు… -
నింగి నీకు హద్దు రా…
నింగి నీకు హద్దు రా…

౧. ఎవడు వాడు ఎచటి వాడు
ఇటు వచ్చిన తెల్లవాడు .ఇటు వచ్చిన తెల్లవాడు
కండ బలం గుండె బలం కబళించే దుండగీడు
మాన ధనం ప్రాణ ధనం దోచుకునే దొంగవాడు
ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచిన తెల్లవాడు
తగిన శాస్తి చెయ్యరా…
తగిన శాస్తి చెయ్యరా…
తరిమి తరిమి కొట్ట రా…
తరిమి తరిమి కొట్ట రా…!!


౨. ఈ దేశం… ఈ రాజ్యం…
నాదేఅని చాటించి…
నాదేఅని చాటించి…
ప్రతి మనిషి తొడలు కొట్టి
శృంఖలాలు పగులగొట్టి
శృంఖలాలు పగులగొట్టి -
చుర కత్తులు పదును పట్టి
తుది సమరం మొదలుపెట్టి
తుది సమరం మొదలుపెట్టి -
సింహాలై గర్జించాలీ…
సింహాలై గర్జించాలీ…
సంహారం సాగించాలీ…
సంహారం సాగించాలీ…
వందే మాతరం… వందే మాతరం

స్వాతంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా…
అల్లూరి సీతారామ రాజా… అల్లూరి సీతారామ రాజా…

అందుకో మా పూజ లందుకో రాజా…
అందుకో మా పూజ లందుకో రాజా…
అల్లూరి సీతారామా రాజా…

తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా
త్యాగాలే వరిస్తాం… కష్టాలె భరిస్తాం…
త్యాగాలే వరిస్తాం… కష్టాలె భరిస్తాం…
నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం…
నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం…
నీ వెంటనే నడుస్తాం…

0 comments:

Post a Comment