Pages

Subscribe:

Saturday 22 March 2014

దేవుడు చేసిన మనుషుల్లారా



దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి మనుషుల గోల కనండి దేవుడిలీల
వినండి మనుషుల గోల కనండి దేవుడిలీల
గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా గోవింద గోవింద భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా గోవింద గోవింద భజగోవిందా

౧.  వెన్నదొంగ ఆ వెన్నదొంగ మా తొలిగురువు
 మా తొలిగురువు
 తొలినుంచీ మా కులగురువు
 కోరినకోరిక తీరాలంటే కోరక మోక్షం రావాలంటే
 గోపాలునే సేవించాలి గోవిందునే ధ్యానించాలి
 గోవింద గోవింద హరిగోవిందా గోవింద గోవింద భజగోవిందా!!వినండి!!

 ౨. పేదల నెత్తురు తాల్చిన రూపం
 బలిసిన జలగలు దాచిన పాపం
 పేదల నెత్తురు తాల్చిన రూపం
 బలిసిన జలగలు దాచిన పాపం
 మానవులను పీడించే జబ్బు దేవతలను ఆడించే డబ్బు
 మానవులను పీడించే జబ్బు దేవతలను ఆడించే డబ్బు
 తెలుపో నలుపో జానేదో ఆ తేడాలిక్కడ లేనేలేవ్
 తెలుపో నలుపో జానేదో ఆ తేడాలిక్కడ లేనేలేవ్
 వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల
 వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల

 గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం
 గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం
 నిన్న మరల రాదు రాదు రాదు నేడే నిజం నేడే నిజం నేడే నిజం
 రేపు మనది కాదు కాదు నేడే సుఖం నేడే సుఖం సుఖం సుఖం నేడే సుఖం
 కాసే బ్రహ్మానందమ్ ఆహా ఓ డోసే పరమానందం ఒహో
 ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం
 ఆనందం పరమానందం ఆనందం పరమానందం
 వినండి గ్లాసుల గోల కనండి మనుషుల లీల!!దేవుడు!!

౩.  ఆలయాలలో వెలుతురు లేదు ఆకాశంలో చీకటి లేదు
 ఆలయాలలో వెలుతురు లేదు ఆకాశంలో చీకటి లేదు
 విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే
 గుడిలో ఎందుకు రామయ్యా నిను విడుదల చేస్తాం రావయ్యా
 రామయ్యా రామయ్యా
 లేవయ్యా లేవయ్యా హ్యాండ్సప్!!
 







0 comments:

Post a Comment