Pages

Subscribe:

Saturday 22 March 2014

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

                         
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజము మరచి నిదురపోకుమా

౧. బడులేలేని పల్లెటూళ్ళలో
బడులేలేని పల్లెటూళ్ళలో చదువేరాని పిల్లలకు
చవుడు రాలే చదువుల బడిలో
జీతాల్రాని పంతుళ్ళకూ!!

౨. చాలీ చాలని పూరిగుడిసెలో
చాలీ చాలని పూరిగుడిసెలో కాలేకడుపుల పేదలకు
మందులులేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు!!

౩. తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలియైపోయిన పడతులకు!!

౪. కూలిడబ్బుతో లాటరీ టికెట్‌ లాటరీ టికెట్‌
కూలిడబ్బుతో లాటరీ టికెట్‌ కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరచి
చెడే నిరాశా జీవులకు!!

౫. సేద్యంలేని బీడునేలలో
పనులే లెని ప్రాణులకు
పగలూ రేయీ శ్రమపడుతున్నా
ఫలితం దక్కని దీనులకు!!

0 comments:

Post a Comment