Pages

Subscribe:

Sunday 23 March 2014

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

  
ప: పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
 పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
 ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ
 పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

౧.  ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు
ఓహొయని పలికెను నీ వలపు
ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు
తియతీయగ మారెను నా తలపు ఒహొహొహొ హొహొహొ!!
 
౨.  తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు
ఆహా దోబూచాడెను నా నగవు
దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ కురులు
దోరదోరగ పండెను నీ పరులు!!
 
౩.  లేదనిపించె నీ నడుము అహహ నాదనిపించెను ఈ క్షణము ఒహొ
లేదనిపించె నీ నడుము నాదనిపించెను ఈ క్షణము
ఉందో లేదో ఈ జగము
ఉందువు నీవు నాలో సగము
ఇది నిజము కాదనుము!!


0 comments:

Post a Comment