Pages

Subscribe:

Monday 31 March 2014

కొబ్బరినీళ్ళ జలకాలాడి

 
కొబ్బరి నీళ్ళ జలకాలాడి ఊహూ ఊహూ ఊహూ
కోనసీమ కోకగట్టి ఆహా ఆహా ఆహా
పొద్దుటెంట తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తావా
ముద్దు తీర్చే సందిటికొస్తావా..ఆ..ముద్దు తీర్చే సందిటికొస్తావా

కొబ్బరి నీళ్ళ జలకాలాడి ఊహూ ఊహూ ఊహూ
కోనసీమ కోకగట్టి ఆహా ఆహా ఆహా
పొద్దుటెంట తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తాలే
ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే ..ఏ..ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే

౧. ఆకాశ వీణల్లో నేను ఊ అనురాగమే పాడుకుంటా
 గోంగూర పచ్చట్లో నేను ఉల్లిపాయే నంజుకుంటా స్స్ నీరుల్లిపాయే నంజుకుంటా
 ఆకాశ వీణల్లో నేను ఊ అనురాగమే పాడుకుంటా
శృంగార వీధుల్లో నేను రసనాట్యమే ఆడుకుంటా ప్రేమ రసనాట్యమే ఆడుకుంటా
మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా
వదిలేస్తే వంకాయ వండించుకుంటా
aa I am sorry
వంకాయవంటి కూరయు పంకజముఖి సీతవంటి భార్యామణి అన్నారు కదండీ
అందుకే అలా పాడానన్నమాట!!

౨.  అమ్మవారి ఎదుట నేనూ..ఊ.. నీ కుంకుమే దిద్దుకుంటా..నీకోసమే కాచుకుంటా
అమ్మతో చెప్పి నేనూ..ఊ..అప్పచ్చులే తెచ్చుకుంటా
అమ్మవారి ఎదుటనేనూ..ఊ..నీకుంకుమే దిద్దుకుంటా.. నీకోసమే కాచుకుంటా
అసురసంధ్య వేళ నేనూ..ఊ.. ఆలయంలో వేచివుంటా..నీ హారతే అందుకుంటా
మాగాయలోన పెరుగేసుకుంటా
వదిలేస్తే నాదారి నే చూసుకుంటా
హ్మ్ చూడండి
మాగాయ మహాపచ్చడి...పెరుగేస్తే మహత్తరి...అదివేస్తే అడ్డవిస్తరి
మానిన్యా మహాసుందరి...అన్నారు కదండీ...అందుకే అలా పాడానన్నమాట
హ హ హ






0 comments:

Post a Comment