Pages

Subscribe:

Sunday 23 March 2014

గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి

    
ప: గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయీ

బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి

౧.  వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి
సొగసులతో ఓరఓర చూపులొస్తాయ
వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి
సొగసులతో ఓరఓర చూపులొస్తాయి
చూపులతో లేని పోని గీరలొస్తాయి
ఆ గీరలన్ని జారిపోవు రోజులొస్తాయి!!

౨.  కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి
కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి
పట్టు తప్పినంతనే పరుగే తీస్తాయి
ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయీ..ఈ..!!

౩.  మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి
మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి
కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి
తొలినాడే చల్లబడి పోవునమ్మాయి!!

౪.  కళ్ళు చూసి మోసపోయి కలవరించకు
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు
కళ్ళు చూసి మోసపోయి కలవరించకు
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు
ఇస్తేను హృదయమెంతో మెత్తనైనది
ఎదురుతిరిగితే అదే కత్తి వంటిది!!

0 comments:

Post a Comment