Pages

Subscribe:

Sunday 23 March 2014

పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల

  
ప: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల
కొంగు జారితేముంది కొంటె పిల్లోడ
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడ

౧.  కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవి
చెప్పలేని ఊసులేవో చెప్పుతున్నవి
కొప్పులోన బంతిపూలు గునుస్తున్నవి
చెప్పలేని ఊసులేవో చెప్పుతున్నవి
ఊసులన్నీ వింటివా ఊరుకోవవి
ఆశలై బాసలై అంటుకుంటవి
ఊసులన్నీ వింటివా ఊరుకోవవి
ఆశలై బాసలై అంటుకుంటవి!!

౨.  వరిచేను కోతకొచ్చి వంగుతున్నది
వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి
వరిచేను కోతకొచ్చి వంగుతున్నది
వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి
వయసు తోటి మనసేమో పోరుతున్నది
వయసు తోటి మనసేమో పోరుతున్నది
వలపులోనే రెంటికి ఒద్దికున్నది
వలపులోనే రెంటికి ఒద్దికున్నది!!

౩.  కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి
కొంటె చూపుతో గుండె దూసుకొంటివి
కొడవలితో లేత గడ్డి కోసుకొంటివి
కొంటె చూపుతో గుండె దూసుకొంటివి
గడ్డిమోపు తలపైన మోసుకొస్తిని
గడసువాణ్ణి తలపుల్లో దాచుకొంటిని
గడ్డిమోపు తలపైన మోసుకొస్తిని
గడసువాణ్ణి తలపుల్లో దాచుకొంటిని!!

0 comments:

Post a Comment