Pages

Subscribe:

Tuesday 18 March 2014

ఏ నిమిషానికి ఏమి జరుగునో

     
ప: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ

౧. కంచెయె నిజముగ చేను మేసిన కాదనువారెవరు
రాజే ఇది శాశనమని పల్కిన ప్రతిఘటించువారెవరు!!


౨. కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా
సాద్వులకేపుడు వెతలేనా తీరని దుఃఖపు కథలేనా!!


౩. ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా
విను వీధిని శ్రేణులుగా నిలచి విడ్డూరముగా చూచెదరా!!


౪. ఎండకన్ను ఎరగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచినా భోదపడవులే దైవ చిద్విలాశాలు!!


౫. అగ్ని పరీక్షకే నిలిచిన సాద్విని
అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయే జనవాక్యమ్మని
అల్పుని మాటయే జనవాక్యమ్మని
అనుసరించుటయే ధర్మమా!!

0 comments:

Post a Comment