Pages

Subscribe:

Wednesday 26 March 2014

ఒక్కరిద్దరుగ మారేది ఇద్దరు ఒకటవ్వాలని


ఒక్కరిద్దరుగ మారేది ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగురవ్వాలనీ
అవ్వాలనీ అవ్వాలనీ

౧.  కడలి పొంగులన్నీ నీ కదలికలో ఉన్నవి
పడగెత్తే పరువాలే నీపైటదాగున్నవీ
నీనవ్వుల పువ్వులలో  నవవసంతమున్నదీ!!2!!
నీ చూపులలోనే వలపూ పిలుపూ ఉన్నవీ!!

౨.   నీ సొగసులు ఝుమ్మంటే నా ఊపిరి వేడెక్కింది
నే నిన్ను తాకగానే ఆ నీలిమబ్బు మెరిసింది
నీజంటగ నేనుంటే  నామనసే ఊగింది!!2!!
నీ కౌగిలిలోనా కలలే నిజమౌతున్నవీ!!

౩.  మరుమల్లెల బాటలో నీ అడుగుల జాడలో
మడుగులొత్తనా ఎదను పరిచి ఈవేళ
నీవునేను ఒకటైతే ఆకాశం అందింది!!2!!
మనకోసం తానే చుక్కల ముగ్గులు వేసింది!!









0 comments:

Post a Comment