Pages

Subscribe:

Thursday 13 March 2014

నిదురపోరా తమ్ముడా

                          
చిత్రం: సంతానం
రచన: అనిశెట్టి-పినిశెట్టి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గానం: ఘంటసాల, లతామంగేష్కర్



నిదురపో... నిదురపో... నిదురపో (2)
 నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా
నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా           
 
కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా


౧. కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే.. ఆ..                    
లేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా ఆ.. ఆ.
జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే..                                   
చితికిపోయిన జీవితమంతా చింతలో చితియాయె
 నీడచూపే నెలవు మనకు నిదురయేరా తమ్ముడా!!

కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే.. ఆ..                    
లేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా ఆ.. ఆ.
జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే..                                   
చితికిపోయిన జీవితమంతా చింతలో చితియాయె
 నీడచూపే నెలవు మనకు నిదురయేరా తమ్ముడా!!





0 comments:

Post a Comment