Pages

Subscribe:

Sunday 23 March 2014

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది

    
ప: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య దాని జిమ్మదియ్య
అందమంతా చీరలోనే ఉన్నది

౧.  మెరుపల్లే వచ్చింది నా ఇంటికి
నన్ను మెల్లంగ దించింది ముగ్గులోనికి
మెరుపల్లే వచ్చింది నా ఇంటికి
నన్ను మెల్లంగ దించింది ముగ్గులోనికి
తలదాచుకొమ్మని తావిస్తివి
తలదాచుకొమ్మని తావిస్తివి
పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి!!

౨.  ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి
దాంతో వెర్రెత్తిపోయింది కురవ్రాడికి
ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి
దాంతో వెర్రెత్తిపోయింది కురవ్రాడికి
పిచ్చివాడనే పేరు చాటున మాటువేసినావు
పిచ్చివాడనే పేరు చాటున మాటువేసినావు
పిల్లదాన్ని పెదవి మీద కాటువేసినావు
హాయ్... సరిసరి సరిసరి సరిసరి సరిసరి!!

౩.  సరసంలో పడ్డాడు ఇన్నాళ్లకి
అబ్బో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి
సరసంలో పడ్డాడు ఇన్నాళ్లకి
అబ్బో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి
తెరచాటు తొలిగింది పరువానికి
తెరచాటు తొలిగింది పరువానికి
అది పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి
సరిసరి సరిసరి సరిసరి సరిసరి

0 comments:

Post a Comment