Pages

Subscribe:

Saturday 22 March 2014

ఎలాగ తీరాలి నీ ఋణమెలాగ తీరాలి

   
ఇలాగ వచ్చి అలాగ తెచ్చి
ఎన్నోవరాల మాలలు గుచ్చి
నా మెడనిండా వేశావు
నన్నో మనిషిని చేశావు
ఎలాగ తీాలి నీ ఋణమెలాగ తీరాలి

తీరాలంటే దారులు లేవా
కడలికి కూడా తీరం లేదా
అడిగినవన్నీ ఇవ్వాలీ
అడిగినప్పుడే ఇవ్వాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలీ!!

౧. అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలు
అడగకముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలీ
నిన్నే తీరున కొలవాలీ
అసలు పేరుతో నను పిలవద్దు
అసలు కన్నా వడ్డీ ముద్దు
ముద్దుముద్దుగా ముచ్చట తీర
పిలవాలీ నను కొలవాలీ!!

౨. కన్నులకెన్నడూ కానగరానిది
కానుకగా నేనడిగేదీ
అరుదైనది నీవడిగేది
అది నిరుపేదకెలా దొరికేది
నీలో ఉన్నది నీకే తెలియదు
నీమనసే నే కోరుకున్నదీ
అది నీకెప్పుడో ఇచ్చేశానే
నీమదిలో అది చేరుకున్నదీ
ఇంకేం?
ఇలాగ తీరిందీ మనఋణమిలాగ తీరింది


0 comments:

Post a Comment