Pages

Subscribe:

Sunday 16 March 2014

శ్రీనగజా తనయం

    
చిత్రం: వాగ్దానం
రచన: బమ్మెరపోతన, జంధ్యాల పాపయ్య శాస్త్రి
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
గానం: ఘంటసాల 
శ్రీనగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీనగజా తనయం
శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ
వచనం: నలభైరోజులనుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నా.
అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తోంది.
నాయనా! కాస్త పాలూ మిరియాలూ, ఏమైనా
శిష్యుడు: చిత్తం, సిద్ధం
వచనం: భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన
వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి, ఆహ్హా!
అతడెవరయ్యా అంటే..
రఘురాముడు, రమణీయ వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల ఘన శ్యాముడు
వాడు నెలరేడు, సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాల జాలురా
వాని చూచి మగవారలైన మైరచి మరుల్కొనెడు
మరోమరుడు మనోహరుడు రఘూరాముడు
సనిదని సగరిగ రిగరిరి సగరిరిగరి సగగరి సనిదని
సగగగరి సనిదని రిసనిద రిసనిద నిదపమగరి
రఘురాముడు
ఔను ఔను
సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా
సనిగరి సనిస సనిరిస నిదని నిదసని దపమ గా-మా-దా
నినినినినినిని పస పస పస పస
సపా సపా సపా తద్దిం తరికిటతక
రఘురాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు
శభాష్ శభాష్
వచనం:  ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని
అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో
గానం: ఎంత సొగసుగాడే
మనసింతలోనె దోచినాడే
ఎంతసొగసుగాడే
మోము కలువ రేడే నా నోముఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ నా మది వివశమాయె నేడే
ఎంత సొగసుగాడె
ఇక్కడ సీతాదేవి యిలా పరవశయై యుండగా
అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి
సభాసదులను చూచి అనియెనిట్లు ఓ యనఘులార నాయనుగు పుత్రి
గానం: సీత  వినయాదిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ దాలిన ఎక్కటి జోదును 
నేడు మక్కువ మీరగవరించి మల్లెల మాలవైచి పెండ్లాడు.
అని ఈ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే
సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్లబడి పోయారట.
మహావీరుడైన రావణాసురుడు కూడ
హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమశ్వరుని చాపము
దీనిని స్పృశించుటయే మహాపాపము
అని అనుకొనినవాడై వెనుతిరిగి పోయాడట.
తదనంతరంబున
ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తనగురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనముతోడ స్వయంవర వేదిక చెంత
మదనవిరోధి శరాసనమును తన కరమున బూనినయంత

ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనె గు
భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె
జానకీ దేహము ఒక నిమేషమ్మునందె
నయము, జయమును భయము విస్మయము
గదురా......ఆ....ఆ
శ్రీమద్రమారమణ గోవిందో హరి!

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉంది
మరొక్కసారి
జై శ్రీమద్రమారమణ గోవిందో హరి
భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి
శివధనుర్భంగు కావించినాడు
అంతట - భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె పృథు గుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్ సీతన్
భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
శ్రీమద్రమారమణ గోవిందో హరి









 

1 comments:

Suresh Kolichala said...

ఇది శ్రీశ్రీ రాసిన పాట. ఫెళ్ళుమనె విల్లు అన్న తేటగీతి పద్యం పాపయ్య శాస్త్రిది. చివర భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె అన్నది పోతన భాగవతం లోనిది. మిగిలిన పద్యాలన్నీ శ్రీశ్రీ రాసినవే.

Post a Comment